![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -368 లో.... రామలక్ష్మిని సీతాకాంత్ తన పుట్టింటికి తీసుకొని వెళ్లి తన చేతే నిజం బయటపెట్టించాలనుకుంటాడు కానీ రామలక్ష్మి మాత్రం తన తల్లితండ్రులు ప్రేమని చూపిస్తున్న కానీ తనే రామలక్ష్మి అని అసలు బయటపడదు.. సుజాత వంట చేస్తుంటే రామలక్ష్మి వెళ్తుంది. నా పెద్ద కూతురు ఇలా అలా అంటూ గొప్పగా చెప్తుంది.
అందరి గురించి చెప్తున్నారు కానీ మీ అబ్బాయి గురించి చెప్పడం లేదని రామలక్ష్మి అడుగగానే.. నాకూ కొడుకున్న విషయం నీకెలా తెలుసని సుజాత అడుగుతుంది. అంటే నాకు సీతా గారు చెప్పారని రామలక్ష్మి కవర్ చేస్తుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తారు. మా కూతురు రామలక్ష్మి కూడా ఇలాగే తింటుందని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి మాణిక్యం వచ్చి రామలక్ష్మి డైరీ ఇస్తాడు. ఇది నా కూతురు డైరీ ఇందులో నీ పేరు రాయ్ గుర్తు గా ఉంచుకుంటామని మాణిక్యం అనగానే.. నా చేతి వ్రాత ద్వారా నేను ఎవరో కనిపెట్టాలి అనుకుంటున్నావు కదా నాన్న అని రామలక్ష్మి అనుకొని లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి వెళ్లిపోతూ సుజాత, మాణిక్యం దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది.
ఆ తర్వాత సీతాకాంత్ వెళ్లి కార్ లో కూర్చుంటాడు. రామలక్ష్మితో సుజాత, మాణిక్యం మాట్లాడుతారు. మాకైతే నువ్వు మా కూతురివే అనిపిస్తుంది. ఏదైనా అది నీకే తెలుసని సుజాత ఎమోషనల్ అవుతుంది. సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరు బయల్దేరి వెళ్ళిపోతారు. అమ్మ నాన్న ప్రేమ అంటూ రామలక్ష్మి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఏంటి నా అత్తమామ నీకు అమ్మ నాన్ననా అని సీతాకాంత్ షాక్ అవుతాడు. అంటే చిన్నప్పుడే నా పేరెంట్స్ చనిపోయారు కదా.. ఆ ప్రేమ నాకు తెలియదని రామలక్ష్మి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |